రేణు దేశాయ్‌ ‘కాశీ మజిలీ’.. ట్రైలర్‌

September 12, 2026


img

మళ్ళీ చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్‌ ‘కాశీ మజిలీ’ అనే ఓ సినిమాలో నటించారు. యమునా కిశోర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర చేయాగా, శంకర్‌ ఇందుచూడన్‌ కీలక పాత్ర చేశారు. 

కాశీకి వెళ్లినప్పుడు అక్కడ ఆమె లగేజ్‌ పోతుంది. తన లగేజ్ కోసం ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయిస్తుంది. కనీసం తన బ్యాగ్‌ ఇప్పించాలని పోలీసులను కోరుతుంది. కాశీలో ఆమెకు ఓ యువకుడు పరిచయం అవుతాడు.

అసలు ఆమె కాశీకి ఎందుకు వెళ్లింది? ఆ బ్యాగులో ఏముంది? ఆమెకు పరిచయమైన ఆ యువకుడు ఎవరు?అక్కడ ఆమెకు ఎదురైన సమస్యలేంటి? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌లో చూపారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: రేణు దేశాయ్‌, సినిమాటోగ్రఫీ: రానా, ఎడిటింగ్‌: మీర్‌ ఎస్‌. సంగీతం: డా. జోశ్యభట్ల. జేకే ఆర్ట్స్‌ బ్యానర్‌పై జగదీష్‌ కుమార్‌ కాళ్లూరు నిర్మించారు.

చాలా కాలం తర్వాత రేణు దేశాయ్‌ నటించినందున ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఈటీవీ విన్‌ ఓటీటీలో సెప్టెంబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష