టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు మీడియా ముందుకు వచ్చి మరోసారి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు సిద్ధిపేట పట్టణంలో వంద ఎకరాలు తన తండ్రి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకరినొకరు కాపాడుకుంటూ ఉంటారు. కాదంటే హరీష్ రావు నొక్కేసిన వంద ఎకరాలపై విచారణ జరిపించగలరా? రేవంత్ రెడ్డి అంటూ కల్వకుంట్ల కవిత సవాలు విసిరారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందే.. రెండు పార్టీలు 22ఏ గురించి వాదించుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నాయి. నేడు శాసనసభ సమావేశాలు ఇంకా జరుగుతున్నాయి. 22ఏలో ఉన్న హరీష్ రావుకి చెందిన వంద ఎకరాల భూవివరాలు నేను పంపిస్తున్నాను. సిఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉన్నట్లయితే, హరీష్ రావుతో ఎటువంటి రహస్య సంబంధాలు లేన్నట్లయితే వాటిపై విచారణ జరిపించాలి,” అంటూ సవాలు విసిరారు.
సిద్దిపేటలో 22 ఏ కింద వంద ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తన తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న హరీశ్ రావు పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? pic.twitter.com/hORB6eIzgb