ప్యారడైజ్‌ ట్రైలర్‌ లేదు.. డైరెక్టుగా సినిమా చూపిస్తారట!

September 12, 2026


img

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ ఈ నెల 24న విడుదల కాబోతోంది. సూపర్ హిట్ దసరా సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక ట్రైలర్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ట్రైలర్‌ లేకుండానే నేరుగా సినిమా విడుదల చేయబోతున్నట్లు అభిమానులకు నాని పెద్ద షాక్ ఇచ్చారు. 

“ట్రైలర్‌ అంటే ప్రేక్షకులను అంచనాలకు తగ్గట్లు అదిరిపోయేలా ఉండాలి. కానీ దాని కోసం మేము ఓ నాలుగైదు రోజులు పూర్తి సమయం కేటాయించి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయం కూడా సినిమా కోసమే కేటాయిస్తే మరింత అద్భుతంగా వస్తుందని భావించి ట్రైలర్‌ లేకుండా సినిమాని నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించాము.  ప్రేక్షకులకు మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడమే మా లక్ష్యం,” అని నాని చెప్పారు.

ఈ సినిమాలో నానికి జోడీగా సుబ్బు... సుబ్బలక్ష్మిగా కయాదు లోహార్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. కీర్తి సురేష్ ప్రత్యేకగీతంలో నానితో కలిసి డాన్స్ చేశారు.                

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించి సెప్టెంబర్‌24న విడుదల చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష