హనుమాన్ అంశ్ త్వరలో తెలుగులో విడుదల

September 12, 2026


img

ఉత్తరాది రాష్ట్రాలలో సూపర్ డూపర్ హిట్ అయిన హిందీ సినిమా హనుమాన్ అంశ్. 1900-73 మద్య కాలంలో జీవించిన హనుమాన్ భక్తుడు, ప్రముఖ ఆద్యాత్మిక గురువు నీమ్‌ కరోలీ బాబా జీవితగాథ ఆధారం ఈ సినిమా తీశారు.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నీమ్‌ కరోలీ బాబాగా శోభిత్ శ్రీవాత్సవ నటించగా, శోభినవ్ సత్యా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.    

కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లు వసూళ్ళు సాధించింది. భక్తిపారవశ్యంలో తన్మయత్వం చెందేలా చేసిన ఈ సినిమాకు ఉత్తరాది ప్రజలు మంగళహారతులు ఇచ్చి మరీ జేజేలు పలికారు.

ఇటీవల కాలంలో ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న ఆధ్యాత్మిక సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సమర్పణలో ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న విడుదల చేస్తోంది. . 

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: విశాల్ చతుర్వేది. సినిమాటోగ్రఫీ: విశాల్ బావా, ఎడిటింగ్: శంఖ్ రాజాధ్యక్ష, పాటలు: సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయస్ ధర్మాధికారి, శంతను సుదామే, సంగీతం: ధీరేంద్ర ముల్కల్వార్, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది,  

స్వంభు మీడియా నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై రాగిణి ఎస్., నమ్రత జి. సింగ్, అనుప్రియా ఎ.నగర్, విశాల్ చతుర్వేది కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

   


Related Post

సినిమా స‌మీక్ష