పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా నుంచి సంయుక్త పుట్టిన రోజు సందర్భంగా ఆమె కొత్త లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
దీనిలో సంయుక్త చాలా సహజంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో టబూ ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమీషనర్ గౌరీ హెగ్డేగా నటిస్తుండగా, దునియా విజయ కుమార్, జరీనా వాహబ్, విటివి గణేశ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: పూరీ జగన్నాథ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యాం కే నాయుడు, ఆర్ట్: ఆశిష్ తేజ, జానీ షేక్, ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా చేశారు.
పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణ రావు కలిసి జేబి మోషన్ పిక్చర్స్, పూరీ కనెక్ట్స్’ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రాపో 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా సంయుక్తని ఆహ్వానిస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.