యూపీఐ ఛార్జీలపై ఫోన్ పే సీఈఓ సమీర్ ఏమన్నారంటే...

August 08, 2026
img

యూపీఐ సేవలకు ఇకపై ఛార్జీలు వసూలు తప్పదంటూ వస్తున్న వార్తలపై ఫోన్ పే సంస్థ సీఈఓ సమీర్ నిగమ్ స్పందిస్తూ, యూపీఐ సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

వ్యక్తుల మధ్య జరిగే సాధారణ యూపీఐ లావాదేవీలపై అంటే ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపినప్పుడు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని స్పష్టం చేశారు. కానీ యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే చెల్లింపుల విషయంలో మాత్రం భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం ఉండవచ్చు.

దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం, బ్యాంకులు, చెల్లింపు సంస్థలు నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జీలను ఎప్పుడు అమలు చేయాలి? ఎవరిపై విధించాలి? ఎంత వసూలు చేయాలి? అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.త్వరలో దీనిపై కూడా స్పష్టత వస్తుంది. 

ఇటీవల లోక్‌సభ దీనికి సంబంధించి చట్టాన్ని ఆమోదించింది.  దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగినందున యూపీఐ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకుగాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవలే చెప్పారు.

Related Post