తెలుగు సినిమాలలో కమెడియన్‌గా సత్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తమిళ సినిమాలలో కమెడీయన్ యోగిబాబు లేని సినిమా ఉండదు. అలాంటి వీరిద్దరితో కలిఫై సినిమా తీస్తే... అదే ‘గోల్డెన్ భాగ్యం.’
పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ చూస్తే వీళ్ళ కామెడీ మామూలుగా ఉండదనిపిస్తుంది
‘గోల్డెన్ భాగ్యం’కు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: పవన్ బసంశెట్టి, సంగీతం: పవన్, నితీష్ జాన్, సినిమాటోగ్రఫీ: బబ్లూ అజు, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేస్తున్నారు.
డాక్టర్ నాగార్జున రెడ్డి పాల్వాయి, శ్రీకాంత్ రెడ్డి బసిరెడ్డి, బాపి రెడ్డి పడాల కలిసి డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.