ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సూపర్‌హిట్ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా అంటే అభిమానుల్లో తప్పకుండా ఆసక్తి నెలకొంటుంది.
తాజాగా తమ సినిమాకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. వెంకటేష్ హీరోగా ఆయన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల నిర్వహించిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు. అయితే ఆ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అది ఫైనల్ కాలేదని త్రివిక్రమ్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా పౌరాణిక కథాంశంతో ఉంటుందా? లేక సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది.