త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకటేష్ కాంబినేషన్‌లో సినిమా అంటేనే చాలా భారీ అంచనాలు ఉంటాయి. వారిద్దరూ కలిసి చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ క్రైమ్-ఫ్యామిలీ డ్రామా పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలు అందుకోబోతోందనే అనిపిస్తోంది.
కానీ తాజాగా విడుదల చేసిన ‘నారాయణమ్మ’ పాటకు సంగీతం, సాహిత్యం రెంటిలో పాత వాసనలు వస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ‘నారాయణమ్మ’ ఈ మూస పాటకు తమన్ కూడా మూస సంగీతం సమకూర్చగా ప్రభ, రామ్ మిరియాల మాత్రం ఇవేం పట్టనట్లు హుషారుగా ఆలపించారు.
వెంకటేష్, శ్రీనిధి శెట్టి, యువినా పార్ధవిల ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’లో నారా రోహిత్, రావు రమేష్, బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.