త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న తెరకెక్కుతున్న‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ సినిమా నుంచి ‘నారాయణమ్మ’ పాట ప్రొమో విడుదలైంది. పూర్తిపాట సోమవారం విడుదలవుతుంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ‘నారాయణమ్మ’ పాటకు తమన్ సంగీతం సమకూర్చగా ప్రభ, రామ్ మిరియాల కలిసి హుషారుగా ఆలపించారు.
ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 9కి వాయిదా పడింది.