కీర్తి సురేష్ ‘డోరతీ’.. అక్టోబర్ 2న రిలీజ్‌

September 26, 2026


img

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘డోరతీ’ అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తమిళంలో సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను రానా దగ్గుబాటి ఆధ్వర్యంలోని స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తోంది.

గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో 1990ల కాలంలో సాగే కథతో ఈ సినిమా రూపొందింది. చిన్ననాటి స్నేహితులైన సుబ్బు (సనంత్), కార్తి (రిషికాంత్) పెరిగి పెద్దవారైన తర్వాత ప్రేమలో పడటం, తర్వాత వారిలో కార్తి స్నేహితుడు కోసం అమ్మాయిగా లింగ మార్పిడి చేయించుకోవడం ఈ సినిమాలో ప్రధాన కధాంశం. ఈ సినిమా ఇద్దరు యువకుల మద్య ప్రేమ, శృంగారం గురించి మాత్రమే కాదు... ఈ నేపధ్యంలో దీనికి సంబందించిన పలు సామాజిక అంశాలను కూడా మనసులకు హత్తుకునేలా చూపారు.     

ఈ సినిమాలో కీర్తి సురేష్‌ పాత్ర పేరు ‘డోరతీ.’ ఈ ఇద్దరి స్నేహితుల జీవితాల్లో ఆమె పాత్ర కీలక మలుపుగా నిలుస్తుంది.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఇది పదో సినిమా. ఈ మూవీ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2026లోని సెంటర్‌పీస్ విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌ను జరుపుకుంది.

మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా, ఎస్. తిరు సినిమాటోగ్రఫీ, గణేశ్ శివ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. కార్తిక్ సుబ్బరాజ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష