అమెజాన్ ప్రైమ్‌లోకి రంభ, ఊర్వశి, మేనక వచ్చేశారు

September 25, 2026


img

చంద్రమోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సురభి జంటగా చేసిన చక్కటి కామెడీ సినిమా ‘రంభ, ఊర్వశి, మేనక’ ఈ నెల 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వించింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చేసింది. కనుక థియేటర్లలో ‘రంభ, ఊర్వశి, మేనక’లను మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూడవచ్చు. 

క్లుప్తంగా వీళ్ళ కథ ఏమిటంటే, మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేష్) ఇంట్లో ఉన్న ఓ మ్యాజిక్ బుక్‌ ఉంటుంది. దానిలో సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక దిగి వచ్చి కోరిన కోర్కెలు తీర్చుతారని సూరికి తెలుస్తుంది. కనుక మరే పని చేయకుండా దానిలో గీతలు గీస్తూ వాళ్ళని రప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. వారు స్వర్గం నుంచి దిగి వచ్చి సూరి కష్టాలు తీర్చారా లేదా? అనేది అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.     

సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, కల్యాణి రాజ్, తారక్ పొన్నప్ప, హరితేజ, గోపరాజు రమణ, గోపరాజు విజయ్, ఆర్.కే.మామ, రచ్చరవి, రవి శివతేజ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష