సందీప్ కిషన్ సిగ్మా.. నాలుగో పాట రేపు రాత్రి

September 24, 2026


img

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న‘సిగ్మా’ నుంచి నాలుగో పాట గురువారం రాత్రి 8 గంటలకు విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కనుక రేపు రాత్రి విడుదల కాబోతున్న నాలుగో పాట, అక్టోబర్ 2న సిగ్మా కోసం ప్రేక్షకులు ఎదురు చూడవచ్చు. 

తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్‌ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబు థాసన్, యోగ్ జపి, మహాలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు పాటలు: వివేక్, సూపర్ సుబ్బు; సంగీతం: థమన్ ఎస్ ; ఎడిటర్‌: ప్రవీణ్ కేఎల్ ; కెమెరా: కృష్ణన్ వసంత్; వీఎఫ్‌ఎక్స్‌ప్రెస్‌: హరిహరసుతన్;  యాక్షన్; వెంకట్ చేశారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన సిగ్మా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష