రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేసిన ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా నిన్న విడుదల చేసిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
హైస్కూల్ దశలో విద్యార్ధుల మద్య ఏర్పడే ఆకర్షణలను ప్రేమలుగా భావించి ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుందో వివరించే చక్కటి కథతో తెరకెక్కించిన సినిమాయే ‘తెల్లకాగితం’.
ఆడపిల్లలు రజస్వల అవడం సహజం. “మరి మగవాళ్ళు కారా వదినా? అంటూ కుర్రహీరో అడిగిన ప్రశ్న కామెడీ. కానీ దానికి అతని వదిన చెప్పిన సమాధానం జీవిత సత్యం!
“ఆడవాళ్ళ బాధని అర్థం చేసుకున్నరోజున మగవాళ్ళు మెచ్యూర్ అయినట్లే!” అని ఆమె సమాధానం.
కనుక తెల్ల కాగితం కేవలం మరో ప్రేమ కథ కాదు.. అంతకు మించి చాలా ఉందని ట్రైలర్‌తో స్పష్టం చేశారు.
ఈ సినిమాలో దీపక్, అజయ్, రూపాలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్. కార్తీక శ్రీనివాస్ చేశారు.
కే. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది.