శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా భారీ అంచనాలతో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి సంగీత కళ్ళలో కన్నీళ్ళు సమ్మక్క... పాట విడుదలైంది. తీవ్ర భావోద్వేగంతో కూడిన ఈ పాటని అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా పాడారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’, ఏష నాగుల పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కళ్ళలో కన్నీళ్ళు సమ్మక్క... అంటూ అనిరుధ్ రవిచందర్ పాడిన ఈ పాత కూడా వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా, విలన్ ‘శికంజ మాలిక్’గా మోహన్ బాబు, ‘బిర్యాని’గా సంపూర్ణేష్ బాబు నటించారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేశారు.
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక తొలిసారిగా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ అక్టోబర్ 24న విడుదల కాబోతోంది.