శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా చేసిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది.
కనుక చిత్ర నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ నేడు జీవో జారీ చేసింది.
అలాగే ఒక రోజు ముందుగా అంటే 23వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షోకి కూడా అనుమతించింది. మొదటి పది రోజులు రోజుకు ఒక షో అదనంగా వేసుకునేందుకు అనుమతించింది.
ప్రీమియర్ షో (23.9.2026) టికెట్ ధర: సింగిల్ స్క్రీన్: జీఎస్టీతో కలిపి రూ.500.00, మల్టీ ప్లేక్స్: రూ 500.00
24.9.26 నుంచి 27.9-26 వరకు సింగిల్ స్క్రీన్: అదనపు చార్జీ 48.00, మల్టీ ప్లెక్స్: అదనపు చార్జీ: రూ.45.00
28.9.26 నుంచి 3.10.26 వరకు సింగిల్ స్క్రీన్: అదనపు చార్జీ: రూ.94.00, మల్టీ ప్లెక్స్: అదనపు చార్జీ: రూ.45.00
ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ పెంచిన టికెట్ ఛార్జీ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 20 శాతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలు జమా చేసింది.
ప్యారడైజ్‌లో తనికెళ్ల భరణి, మోహన్ బాబు, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, కృష్ణ తేజ, తదితరులు నటించారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేశారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాను బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నారు.