మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున నేడు టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ముకేశ్ రిషి, కలైయరసన్ హరికృష్ణన్, ఎలాంగో కుమరవేల్, గెటప్ శ్రీను, రఘుబాబు, అరుణ భిక్షు, ప్రవీణ లలితాబాయి, రోహన్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేశారు.
వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మించారు. అక్టోబర్ 9న ఇట్లు అర్జున థియేటర్లలో విడుదల కాబోతోంది.