ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు.. అంటే ఈ లోకంలో డబ్బే అన్నిటికి మూలం అన్నమాట. సరిపడా డబ్బు లేకనే నిరుపేదలు ఆకలితో అలమటిస్తుంటే, సామాన్య మద్య తరగతి ప్రజల జీవితాలు కత్తి మీద సాములా సాగుతూనే ఉంటాయి. అలాంటి మధ్యతరగతి కుటుంబానికి లాటరీ తగిలితే? అనే పాయింట్ తీసుకొని దర్శకుడు అరవింద్ రెడ్డి కథ రాసుకొని ‘రూపాయనమహా’ పేరుతో సినిమా సిద్ధం చేశారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల చేశారు.
ఈ సినిమాలో అరవింద్ పాండ్రటే, వేణు పోలసాని, క్రాక్ శ్రీమణి, డి. అనుదీప్, శ్రావణి మాల్కాని తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మధ్యతరగతి కుటుంబతో కథ అంటేనే అనేక భావోద్వేగాలు, పుష్కలంగా కామెడీ, కష్టాలు, కోర్కెలు ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్‌లో కూడా అదే కనిపించింది.
ఒక లాటరీ టికెట్‌తో ఓ కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తర్వాత ఏం జరుగుతుంది? ఇంతకీ వారికి ఆ లాటరీ తగిలిందా లేదా? అని ఆసక్తి కలిగించేలా ట్రైలర్ రూపొందించారు.
ఈ సినిమాలో విశాన్ శ్రీ, కావ్య శెట్టి, హుస్సేన్, ప్రవీణ్ మలిశెట్టి, వినోద్ సాగర్ లీ, నవీన్ షెత్కర్, ఎస్.ఆర్. నీరుడి, అలహరి అమృతవల్లి, రైతుబిడ్డ నితిన్, శివ శంకర్, వేదం నాని తదితరులు నటించారు.
‘రూపాయనమహా’ చిత్రానికి కథ, దర్శకత్వం: టి.అరవింద్ రెడ్డి, సంగీతం: రిషి ఎం; సినిమాటోగ్రఫీ: జె. వరుణ్ నాయుడు; ఆర్ట్: వంశీ మునగాల. ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేశారు. చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి ఈ సినిమా నిర్మిస్తున్నారు.