మగాళ్లు జిందాబాద్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌

September 18, 2026


img

మగాళ్లు జిందాబాద్ అనే టైటిల్‌తోనే సినిమా కథ సగం చెప్పేసినట్లే. నార ప్రవీణ్ దర్శకత్వంలో శ్రీనందు, వెన్నెల  వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు చేస్తున్నారంటే కామెడీకి కరువు లేదన్న మాటే! నేడు ‘మగాళ్లు జిందాబాద్’ టైటిల్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమాలో శారదాంబ హోటల్‌ యజమాని ‘గన్నెల్’గా శ్రీనందు, ‘ముక్కోడు’ కటింగ్ షాప్ ఓనర్‌గా వెన్నెల కిషోర్ , ‘ఈగల్’గా వైవా హర్ష్ రోషన్‌ కామెడీ పండించబోతున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో చెప్పేశారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: నారా ప్రవీణ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, మదిన్, మున్నా కాశి, సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి, ఆర్ట్: అమ్ము కార్తీక్, ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేస్తున్నారు. 

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష