ఎఫ్-1 రేసింగ్ కేసులో నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మా కుటుంబానికి లక్ష కోట్లు ఆస్తులున్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు కనుక నేను ఆయనకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా.
మాకు ఓ వెయ్యి కోట్లు ఇచ్చి మా వద్ద ఉందన్న ఆ లక్ష కోట్లు మీరే తీసేసుకోండి. ఆ 99 వేల కోట్లతో మీరు ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేయండి. నా ఆఫర్ స్వీకరించేందుకు సిద్ధమేనా రేవంత్ రెడ్డి? అంటూ సవాలు విసిరారు.
కేసీఆర్ మీద కక్షతోనే సిఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని, తమపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా వేదించినా తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ఇలాంటి అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొని నిలబడిందని, ఈ అక్రమ కేసులను కూడా ఎదుర్కొని పోరాడుతామని కేటీఆర్ అన్నారు.
మొన్నటిదాకా కేసీఆర్ గారికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడి.. నిన్న అసెంబ్లీలో కేవలం 67 ఎకరాలే అని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడు.
మరి మిగతా 933 ఎకరాలు ఎక్కడిపోయినై రేవంత్?
22A నిషేధిత భూముల పేరుతో కాంగ్రెస్ నొక్కుతున్న 30% కమీషన్ల గుట్టు బయటపడిందనే ఈ కొత్త… pic.twitter.com/PbHouxJc5N