ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నేడు తుది తీర్పు వెలువరించింది. అయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
కనుక ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు పరిగణించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజేపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై నేడు తుది తీర్పు వెలువరిస్తూ, ఆయన విషయంలో ప్రతిపక్ష సభ్యులు చెప్పిన అభ్యంతరాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నట్లు వ్యవహరించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.
అయన బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయడమే అయనపై అనర్హత వేటు పడేలా చేసింది. మిగిలినవారు కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నప్పటికీ సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు నిరూపించుకొని అనర్హత వేటు నుంచి తప్పించుకోగలిగారు.
హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ ఇంకా స్పందించాల్సి ఉంది. బహుశః సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తానని అంటారో లేదా హైకోర్టు తీర్పుని గౌరవిస్తున్నానని హుందాగా తప్పుకుంటారో చూడాలి.