నేడు అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “22ఏ గురించి బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది కనుకనే నేడు అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టి మాట్లాడుతున్నాము. బీఆర్ఎస్ నేతలు మాకు బాధ్యత గుర్తుచేసే పరిస్థితిలో మేము లేము.
అసెంబ్లీలో వారి హయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇంకా పొరుగు రాష్ట్రాలలో హరీష్ రావు చేస్తున్న క్షుద్రపూజల గురించి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి ఉంటుందనే భయంతోనే సభలో రభస చేసి సస్పెన్షన్ వేటు వేయించుకొని పారిపోయారు.
పైగా మాక్ అసెంబ్లీ నిర్వహించి చట్ట సభలను, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్షుద్రపూజలు చేసినప్పుడు కలుగని భయం, దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందంటే భయం దేనికి?ఆ భయంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఇలాంటి వికృత చేష్టలు చేయడం దేనికి?
ఇదివరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు నినాదాలతో కూడిన డ్రస్సులు, ప్లకార్డులతో సభ్యులను అసెంబ్లీకి అనుమతించరాదని నిబంధన పెట్టారు. కానీ దానిని మీ సభ్యులే ఉల్లంఘించి లోనికి ప్రవేశించబోతే పోలీసులు అడ్డుకున్నారు. కానీ అప్పుడు మీరు చేసిన వికృత చేష్టలను తెలంగాణ ప్రజలందరూ కళ్ళారా చూశారు.
పోలీసులపై దాడి చేశారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దొరల అహంకారానికి ఇవన్నీ నిదర్శనం కావా?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీలో నల్ల టీషర్ట్లపై సీఎం రేవంత్ వివరణ
పార్లమెంట్లో స్లోగన్స్ ఉన్న నల్ల టీషర్ట్లతో రావచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీలను అనుమతించారని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో అలాంటి టీషర్ట్లపై నిబంధన ఉండటంతో బీఆర్ఎస్ నేతలను… pic.twitter.com/h9vWkdmsBW