హతః గ్లిమ్స్‌ ఇంత ఆసక్తిగా ఉంటే టీజర్‌ ఎలా ఉంటుందో?

September 16, 2026


img

అనుష్ గోరక్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం సమర్పణలో వస్తున్న సినిమా పేరు ‘హతః.’ దీని టైటిల్‌ గ్లిమ్స్‌తోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఓ ఎరుపు రంగు అట్టపెట్టెలో కూర్చొన్న నల్లపిల్లి మెడని నాలుగు ఎరుపు రంగు చేతులు పట్టుకుంటున్నట్లు చూపారు. ఇంతకీ ఆ పిల్లి బతికుందా లేదా? అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. 

ఇప్పుడు ఈ నెల 18న ఈ సినిమా టీజర్‌ విడుదల చేయబోతున్నామంటూ వేసిన పోస్టర్‌, వీడియో, దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచాయి. కనుక టీజర్‌ మరింత ఆసక్తికరంగానే ఉండవచ్చు.      

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం నటించడం లేదు. రెహమాన్, తనూజ పుట్టస్వామి జంటగా నటించగా, కుష్లు మద్దాల, నమ్రిత ఎంవీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.      

ఈ సైకలాజికల్ మిస్టరీ, థ్రిల్లర్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: అనుష్ గోరక్, సంగీతం: జాసిన్ జార్జ్ చేస్తున్నారు. కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘హతః’ని కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు కలిసి నిర్మిస్తున్నారు. టీజర్‌లో సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష