బాదుడు లేదంటూనే యూపీఐ బాదుడు

September 15, 2026
img

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యూపీఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఛార్జీలు విధించే నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ముఖ్యంగా రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

అయితే రూ.2,000కు మించిన కొన్ని లావాదేవీల విషయంలో కొత్త నిబంధన చర్చకు వచ్చింది. ఇలాంటి చెల్లింపులపై వ్యాపారి తగ్గింపు రుసుము (ఎండీఆర్‌) విధించేందుకు చట్టపరంగా అవకాశం కల్పించారు. 

ఇది వినియోగదారుడి నుంచి నేరుగా వసూలు చేసే యూపీఐ ఛార్జీ కాదు. డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులపై బ్యాంకులు లేదా చెల్లింపు సేవల సంస్థలు విధించే రుసుము.

ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే యూపీఐ లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయి. కానీ దాని పరిమితి రూ.2,000కు దాటితే ఛార్జీలు పడతాయి. ఫోన్ బిల్లులు, రైల్వే స్టేషన్‌ టికెట్స్ కొనుగోలు, ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు, విద్యుత్ ఛార్జీలు వంటివాటిపై రూ.2,000కి మించి చేసే ప్రతీ చెల్లింపుపై రూ.5 చార్జీ, ఇతర రకం చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

సామాన్య ప్రజలపై ఎలాంటి భారం మోపలేదని చెప్తున్నప్పటికీ, రూ.2,000కి మించి చేసే ప్రతీ చెల్లింపుపై పడే అదనపు ఛార్జీలను వ్యాపార సంస్థలు, భరించవు. వాటిని తిరిగి ఏదో రూపంగా సామాన్య ప్రజల నుంచే ముక్కు పిండి వసూలు చేస్తాయి. అక్టోబర్ 15 నుంచి ఈ యూపీఐ బాదుడు మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related Post