ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కనుక నేడు ఆమె ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంది.
మంత్రి పదవి పోయిన తర్వాత కూడా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె చెప్పినప్పటికీ చాలా మంది ఆమె మాటలను నమ్మలేదు. ఇంత అవమానం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆమె కొనసాగడం కష్టమే. కనుక ఆమె తప్పకుండా పార్టీ మరుతారనే అందరూ భావించారు. కానీ బిజేపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆమె తమకు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆమె పరిస్థితి అయోమయంగా మారింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజ్ ఫోన్ చేసి, శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పడం కాస్త ఊరటనిచ్చేదే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కొండా సురేఖ పరిస్థితి వేగంగా మెరుగవుతున్నట్లే భావించవచ్చు. ఆమెను ఊరడించి తగిన పదవి, బాధ్యతలు అప్పగించేందుకు పిలిచి ఉండవచ్చు.