జానకీ రామ్ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే పేరు చూడగానే, అడవులలో మావోయిస్టులు, తుపాకుల మోతలే అనుకుంటాము. కానీ టీజర్‌లో ఒడిశా అమ్మాయితో ప్రేమ, మద్యలో సినిమా హాలు సన్నివేశం, మావోయిస్టులతో కామెడీ చూసినప్పుడు, ఇది కామ్రేడ్ కళ్యాణ్ సినిమా టీజరేనా కాదా? అని అనుమానం కలుగుతుంది.
హీరోయిన్‌తో ప్రేమ వగైరా మావోయిస్టులలో చేరే ముందు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అని సరిపెట్టుకున్నా, మావోయిస్టుగా మారిన తర్వాత ఆ కామెడీ ఏమిటి? శ్రీవిష్ణు మావోయిస్టులను కూడా వదిలిపెట్టలేదా?అనే సందేహం కలుగుతుంది.
ఈ సినిమాలో శ్రీవిష్ణు తల్లిగా రాధికా శరత్ కుమార్ నటించగా, వెన్నెల కిషోర్, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేశారు.
స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.