శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసిన ‘ఇరుముడి’ ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలై అందరినీ అలరించింది. కనుక సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది.
ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర అద్భుతంగా నటించారు. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ‘ఇరుముడి’లో భక్తి, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, యాక్షన్, కథ అన్ని సమపాళ్ళలో కుదిరినందున ప్రేక్షకులు ఇరుముడిని నెత్తిన పెట్టుకొని రవితేజకు హిట్ ఇచ్చారు. థియేటర్లకు వెళ్ళి చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని ఇరుముడి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.