ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ... ట్రైలర్‌

September 13, 2026


img

అన్నపూర్ణ, ఆమని, ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, సునయన, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు మహిళల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో వంశీ, రవి శివతేజ, పృథ్వీ దండమూడి, రూఫా శ్రీనివాస్‌ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

అభిరామ్‌ నాయుడు స్క్రీన్ ప్లే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కథ: హేమంత్‌ ధోమే, సినిమాటోగ్రఫీ: సుబ్రమణియన్‌ మణికందన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఛోటా కె. ప్రసాద్‌ చేశారు.

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై  బాలాజీ, గుండాల కౌశిక్‌ రెడ్డి నిర్మించిన హ్యాపీ జర్నీ ఈ నెల 18 నుంచి థియేటర్లలో ప్రారంభం అవుతుంది. 


Related Post

సినిమా స‌మీక్ష