రామ్ నందన్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, రాయంచ కొక్కుర జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆస్మాన్’. దీని పేరు హిందీలో ఉన్నా ఇది తెలుగు సినిమాయే. ఆస్మాన్ అంటే ఆకాశం. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, అరబిక్ భాషలో నిర్మిస్తున్నారు.
ఆస్మాన్ టీజర్ నేడు విడుదలైంది. టీజర్ చూస్తే ఇది మానవాతీత శక్తుల గురించి కథ అని అర్ధమవుతుంది. మద్యలో హీరోగారి ఫైట్స్, హీరోయిన్‌తో రొమాన్స్ కూడా చూపారు కనుక కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా దట్టించినట్లే ఉన్నారు.
ఈ సినిమాకు పాటల రచయిత: తిరుపతి జవ్వన, సంగీతం: ప్రశాంత్ విహారి, ఆర్ట్: ధని ఏలే, ఫైట్స్: కురపాటి శివ, చేస్తున్నారు.
క్లిన్ కారా సెల్యులాయిడ్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:1గా రూపొందుతున్న ఈ సినిమాను కొండరు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం నిర్మాతలు కాగా, మెగా ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్మాన్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.