‘మాయ లేడీ’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌.. వెరైటీగా ఉందే!

September 16, 2026


img

రాకేష్‌ వర్రే, మధుమిత సర్కార్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాయ లేడీ’. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ ప్రకటన చాలా వెరైటీ చేశారు. ఈ సినిమాను నిర్మిస్తున్న రాకేష్‌ వర్రే హీరోగా కూడా చేస్తున్నారు.

కనుక  ‘ప్రొడ్యూసర్‌ వర్సెస్‌ యాక్టర్‌’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో చూసి అందరూ నవ్వుకోకుండా ఉండలేరు. ఓ నటుడుగా, నిర్మాతగా ఇద్దరి తీరు ఎంత భిన్నంగా ఉంటుందో దీనిలో చక్కగా చూపారు. ఈ మాయాలేడి టీజర్‌ గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో సత్య, ఇంద్రజ, మైసూర్‌ సురేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘మాయ లేడీ’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ప్రసాంకర్‌, పాటల రచయిత: కృష్ణన్‌ కాంత్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ: యెధు రాధాకృష్ణన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: భార్గవ నౌండ్ల, ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల చేస్తున్నారు. 

వీ.డీ. జగన్మోహన్‌ రావు సమర్పణలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేష్‌ వర్రే స్వయంగా నిర్మించి హీరోగా నటిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష