ఈరోజు శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు బహిర్గతం చేశారు. అధికారికంగా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులకు కలిపి మొత్తం 440 ఎకరాలున్నాయని తెలిపారు.
తెలంగాణ ఉద్యమాల వలన అనేక కుటుంబాలు సర్వం కోల్పోయారు. బలిదానాలతో అనేక కుటుంబాలు తమ పిల్లలను, ఆప్తులను కోల్పోయాయి.
కానీ ఉద్యమాలకు ముందు ఆస్తులు లేని కేసీఆర్ కుటుంబం పదేళ్ళ పాలనలో ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఏవిధంగా సంపాదించారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందనేందుకు ఈ ఆస్తులే నిదర్శనమన్నారు.
ఇవన్నీ అధికారికంగా వారి వారి పేర్ల మీద రిజిస్టర్ అయిన భూములు మాత్రమే. బినామీ పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని వందల ఎకరాలు ఉన్నాయో? అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కేసీఆర్ కుటుంబ భూముల వివరాలు.. ఆయన మాటల్లోనే విందాం..