ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితగాథ ఆధారంగా ‘ఎంఎస్-ఏ లీగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో సినిమా లాంచనంగా నిన్న చెన్నైలో మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నటిస్తున్నారు. రష్మిక మందనపై కమల్ హాసన్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. త్వరలోనే రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నటించే అవకాశం తనకు లభించడం చాలా అదృష్టంగా, చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ పాత్రకు తాను పూర్తి న్యాయం చేస్తానన్నారు.
గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.