రేవంత్ కుటుంబానికి 308 ఎకరాలున్నాయిగా!

September 17, 2026


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం శాసనసభ కేసీఆర్‌ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా440 ఎకరాలున్నాయని ప్రకటించడంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీల మద్య మరో సరికొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటనని ఖండిస్తూ ట్వీట్‌ చేయగా, మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా తీవ్రంగా స్పందించారు. 

నిన్న బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, “శాసనసభలో రేవంత్ రెడ్డి ఇది చెప్పిన గంటలోపే నా ఫోన్‌కు మెసేజ్‌లు రావడం మొదలైపోయాయి. వాటిలో రేవంత్ రెడ్డి కుటుంబానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలున్నాయో వివరాలున్నాయి. 

అయితే సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా నేను ఆరోపణలు చేయలేనని చెప్పడంతో, రెండు ఆస్తుల డాక్యుమెంట్ పత్రాల నకళ్ళు వచ్చాయి. 

వాటి ప్రకారం కేవలం రెండు గ్రామాల్లోనే మీకు 308 ఎకరాలున్నట్లు తేలింది. వాటిలో మీ భూములు పక్క నుంచి బుల్లెట్ రైలు వెళ్తుందని తెలిసింది. మా చేతిలో అధికార యంత్రాంగం లేదు. మీలాగ మాకు బలమైన నెట్‌వర్క్ కూడా లేదు. 

కానీ శాసనసభలో మీరు ఈ ప్రకటన చేసిన గంటలోపే ఈ వివరాలు మా చేతికి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీ కుటుంబానికి ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలున్నాయో సాక్ష్యాధారాలు సేకరించి అన్నిటిని త్వరలోనే బయటపెడతాం,” అని హరీష్‌ రావు అన్నారు. 

ఆయనేమ్మన్నారో ఆయన మాటల్లోనే...                   


Related Post