రణబాలి..ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది వెన్నెల

September 19, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత సినిమాలో కూడా భార్యాభర్తలు చేస్తున్న చిత్రం రణబాలి. ఈ సినిమాలో రణబాలిగా విజయ్‌ దేవరకొండ, అతని భార్య జయమ్మగా రష్మిక నటించారు.

నిజ జీవితంలో ప్రేమలో పడినట్లే ఈ సినిమాలో కూడా మళ్ళీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ, “ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది వెన్నెల..” అనే తొలిపాటని సోమవారం విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ మైత్రీ మూవీస్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు అజయ్-అతుల్ సంగీతం అందించగా అజయ్ గోగావలె, శ్వేతా మోహన్ కలిసి మృదుమధురంగా ఆలపించారు. 

రణబాలి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ,మళయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నందున ఐదు భాషల్లో ఒకేసారి ఈ పాట విడుదల చేయబోతున్నారు. 1876-78 సంవత్సరాల మధ్య కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో నేపధ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష