సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న‘సిగ్మా’ ట్రైలర్ విడుదలైంది. సినిమాలో కామెడీ, రొమాంటిక్, యాక్షన్ మూడు పుష్కలంగా ఉంటాయని ట్రైలర్‌తో చెప్పేశారు. కనుక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలవుతున్న సిగ్మా కోసం ఎదురుచూడవచ్చు. .
జోసఫ్ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలోకి వెళ్ళి తొలి దశ ప్రయత్నంలోనే ఎన్నికలలో విజయం సాధించారు. తమిళనాడు సిఎం కూడా అయ్యారు. ఆయన కుమారుడు జాసన్ సంజయ్ కూడా ఈ తొలి సినిమాతో దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకోబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.
ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబు థాసన్, యోగ్ జపి, మహాలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు పాటలు: వివేక్, సూపర్ సుబ్బు; సంగీతం: థమన్ ఎస్ ; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ ; కెమెరా: కృష్ణన్ వసంత్; వీఎఫ్‌ఎక్స్‌ప్రెస్: హరిహరసుతన్; యాక్షన్; వెంకట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన సిగ్మా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.