పేదల కోసం కొట్లాట అంటే మాటలా?

September 20, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్వర్యంలో అదివారం సాయంత్రం కొడంగల్లో పాంచజన్యం సంకల్ప సభలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ఆవేశంగా ప్రసంగించారు. 

“నేను రేవంత్ రెడ్డి విడిచిన బాణానని బీఆర్ఎస్‌ పార్టీ అంటుంది. నేను కేసీఆర్‌ విడిచిన బాణానని రేవంత్ రెడ్డి అంటారు. మరొకరు నేను ప్రధాని మోడీ విడిచిన బాణానంటారు. ఇలా నాగురించి నోటికొచ్సినట్లు మాట్లాడుతున్నవారందరికీ, ఈ కొడంగల్ గడ్డపై నిలబడి ఒకటే మాట చెపుతున్నా. నేను ఎవరు విడిచిన బాణాన్ని కాను. నేటికీ చదువుకు దూరంగా ఉండిపోయిన నా తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను. అంబేద్కర్ వాదాన్ని నేను. తెలంగాణ యువత యుద్ధ నినాదాన్ని నేను. పూలేగారి ఆత్మగౌరవ నినాదాన్ని నేను.

మా సావిత్రీ బాయి పూలే అమ్మలా నేను కూడా ధైర్యంగా నిలబడి ఈ వందమంది మగాళ్ళని ధైర్యంగా ఎదిరిస్తున్న వీరవనితను నేను. మీరు నాకు ధైర్యం ఇస్తే ప్రధాని మోడీతో కొట్లాడుతా. కేసీఆర్‌ గారితో కొట్లాడుతా. రేవంత్ రెడ్డితో కొట్లాడుతా..

ఈ వేదికపై నుంచి మన మగమహారాజులకు చాలెంజ్ చేసి చెపుతున్నా. నాకు ఎవరి మద్దతు లేకపోయినా ధైర్యంగా మీ అందరినీ ఎదుర్కొంటా. పోరాడి విజయం సాధిస్తా,” అంటూ కల్వకుంట్ల కవిత ఆవేశంగా ప్రసంగించారు.       

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతానంటున్న కల్వకుంట్ల కవిత రెండు వందల కార్లు వేసుకొని ర్యాలీగా రావడమే ఆశ్చర్యం. తాను దొర బిడ్డనని ఆమె స్వయంగా చాటింపువేసుకుని పేదల కోసం కొట్లాడుతానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా? 


Related Post