టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అదివారం సాయంత్రం కొడంగల్లో పాంచజన్యం సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. దీని కోసం ఆమె సుమారు రెండు వందల కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఆమె ఈ స్థాయిలో ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం ఒకటి. కానీ ప్రజలకు చేరేది వేరేగా!
వేలాదిమంది ప్రజలు తన వెంట వస్తున్నారని ఆమె చెప్పుకున్నారు. కానీ ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం భారీగా భూదోపిడికి పాల్పడి వేలకోట్లు పోగేసుకుందని ఆరోపిస్తున్నప్పుడు, తమ ఆరోపణలు నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కల్వకుంట్ల కవిత రెండు వందల కార్లతో ర్యాలీ తీసి, తమ కుటుంబంలో ఎవరికీ డబ్బుకు కరువు లేదని ధ్రువీకరించినట్లవుతోంది.
గతంలో ఆమె తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఇలాగే 5-6 వందల కార్లు వేసుకొని దండయాత్రకు బయలుదేరినట్లు వెళ్ళారు. అది చూసి బీఆర్ఎస్ పార్టీ.. అధినేత కేసీఆర్ బాగా ‘సౌండ్ పార్టీ’ అని భావించేలా చేశారు.
ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా సరిగ్గా అలాగే చేసి నిరూపించి చూపుతున్నారు. కనుక పాంచజన్యం సభలో ఆమె చెప్పబోతే మాటలు, చేసే విమర్శలు, ఇవ్వబోయే హామీల కంటే ముందు ప్రజలకు బలమైన రాంగ్ మెసేజ్ పంపినట్లయిందని చెప్పక తప్పదు.
A sea of people, a wave of change.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 20, 2026
Today, all roads in Telangana lead to Kodangal for the TRS Panchajanya Sankalpa Sabha. pic.twitter.com/i2knWusxaq