నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన సూపర్ హిట్ సినిమా ‘జైలర్’కు సీక్వెల్ జైలర్-2 సిద్ధమైంది. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జైలర్-2 ట్రైలర్ విడుదల చేశారు. దానిలో రజనీకాంత్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్య పాత్రలు కూడా పరిచయం చేశారు.
జైలర్-2లో రజనీకాంత్‌కి జంటగా రమ్యకృష్ణ నటించగా, ఎస్.జే.సూర్య, యోగిబాబు, సునీల్, మీర్నా, అన్నారాజన్, జతిన్ సరనా సూరజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, వినాయకన్, విజయ్ సేతుపతి అతిధి పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; సంగీతం: అనిరుద్ రవిచందర్; కెమెరా: విజయ్ కార్తీక కన్నం; ఆర్ట్: డిఆర్ కిరణ్; స్టంట్స్: చేతన డిసౌజా; ఎడిటింగ్: ఆర్ నిర్మల్ చేశారు.
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన జైలర్-2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.