రణబాలిలో జయమ్మ ఫీలింగ్స్ ఏందయ్యా సామి?

September 22, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళి తర్వాత భార్యాభర్తలు నటించిన చిత్రం రణబాలి. ఈ సినిమా నుంచి “ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది వెన్నెల..” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది.

కండలు తిరిగిన వీరుడు తన భర్త రణబాలిని మైమరచి చూస్తూ ఎదురు చూస్తూ జయమ్మ పాడిన ప్రేమగీతమే ఇది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు అజయ్-అతుల్ సంగీతం అందించగా అజయ్ గోగావలె, శ్వేతా మోహన్ కలిసి మృదుమధురంగా ఆలపించారు.

ఈ పాట వింటునప్పుడు పుష్పలో ఫీలింగ్స్ పాట గుర్తువస్తే తప్పుకాదు. ఆ సినిమాలో హీరోని చూసి హీరోయిన్‌కు ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయన్న మాట!     

1876-78 సంవత్సరాల మధ్య కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో నేపధ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష