రాజమౌళి టీమ్‌ చేసిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ట్రైలర్‌

September 23, 2026


img

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సారా పాలేకర్ ప్రధాన పాత్రలు చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి టీమ్‌ ఈ సినిమాకు పనిచేయడం, ఆయన సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాలో ఏదో గొప్ప విశేషమే ఉందని భావించవచ్చు. ట్రైలర్‌ కూడా అలాగే ఉంది.    

ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ, సినిమాటోగ్రఫీ: బ్రాడ్ ఫ్రాన్సిస్, స్టైలిస్ట్‌: రమా రాజమౌళి , ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోనీ VFX: శిఖర్ శ్రీవాస్తవ (ఓల్డ్ మాంక్ స్టూడియో) 

ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష