రజనీకాంత్ జైలర్‌-2: ఒక సూర్యుడు ఒక చంద్రుడు లిరికల్

September 26, 2026


img

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ‘జైలర్-2’ ఈ ఏడాది అక్టోబర్ 15 న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ర్యాప్ సాంగ్‌ విడుదలైంది. 

హైసన్ బర్గ్, భాస్కరభట్ల వ్రాసిన ఈ పాటకు అనిరుధ్ రవిచందర్‌ సంగీతం అందించి ఇన్నో గెంగా, ఎంఎస్ కృష్ణలతో కలిసి పాడారు. ఈ ర్యాప్ సాంగ్‌లో తెలుగు కంటే ఇంగ్లీషు పదాలే ఎక్కువున్నాయి కనుక యువతరానికి బాగా నచ్చుతుంది. ఈ పాటలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి.  

జైలర్-2లో రమ్యకృష్ణ,  ఎస్.జే. సూర్య, యోగిబాబు, మీర్నా, అన్నారాజన్, జతిన్ సరనా సూరజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌, మిథున్ చక్రవర్తి, వినాయకన్, విజయ్‌ సేతుపతి అతిధి పాత్రలలో నటించారు.  

ఈ సినిమాకు కధ దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్‌; సంగీతం: అనిరుద్ రవిచందర్; కెమెరా: విజయ్‌ కార్తీక కన్నం; ఆర్ట్: డిఆర్‌ కిరణ్; స్టంట్స్: చేతన డిసౌజా; ఎడిటింగ్: ఆర్‌ నిర్మల్ చేశారు. 

కళానిధి మారన్‌ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన జైలర్-2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష