అక్టోబర్ నుంచి కల్కి-2 రెగ్యులర్ షూటింగ్‌

September 26, 2026


img

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా 2024, జూన్‌ 27న విడుదలైన ‘కల్కి ఎడి2898’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తీస్తున్నప్పుడే సీక్వెల్‌ కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో కల్కి-2లో కొన్ని సన్నివేశాలు షూటింగ్‌ జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అక్టోబర్ నుంచి ఈ కల్కి సీక్వెల్‌ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లోగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే దసరా, దీపావళి పండగ సీజన్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.      

కల్కిమొదటి భాగంలో కీలక పాత్ర చేసిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడంతో ఆమె స్థానంలో ప్రియాంకా చోప్రాను తీసుకున్నారు. 

కల్కి ఎడి2898లో కీలక పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సల్మాన్ దుల్కర్, మృణాల్ ఠాకూర్ విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, సస్వత చటర్జీ, పశుపతి, తదితరులందరూ ఈ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.

కల్కి ఎడి2898 సూపర్ హిట్ అవడంతో ఈసారి రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ సీక్వెల్‌ను వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. 


Related Post

సినిమా స‌మీక్ష