మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి కాంబినేషన్‌లో సినిమా అంటేనే మాస్ మసాలా కమర్షియల్ మూవీ. తాజాగా వారిద్దరూ కలిసి చేస్తున్న ‘కాకా’ సినిమా ఫస్ట్ టీజర్ చూస్తే అదే అనిపిస్తుంది. హీరోయిజం దాని కోసం ఎలివేషన్స్, కాస్త సెంటిమెంట్, పగ ప్రతీకారం.. దాని కోసం నరుకుడు, రక్తపాతం ఇదే కాకా అనిపిస్తుంది. అవునో కాదో ఫస్ట్ టీజర్ చూసి చెప్పలేము కానీ ఇదే కావచ్చని అర్ధమవుతోంది. తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ రామాయణం, భారతం గురించి చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి ఆక్వా పరిశ్రమలో పనిచేసే సూపర్‌వైజర్ సత్యంగా నటిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, మోహన్ బాబు, సునీల్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్‌ఎక్స్: యుగంధర్ చేస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాకా’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది.