పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న ‘స్లమ్ డాగ్ టెంపుల్ స్ట్రీట్-33’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి ‘టబూ’ ఆమె కంటే చాలా సీనియర్ నటి జరీనా వాహెబ్ కూడా ఓ మఖ్యపాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాలో ఆమె జుబైదా అనే ముస్లిం మహిళగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లో పరిచయం చేశారు. దానిలోనే సోమవారం ఉదయం 10 గంటలకు గ్లిమ్స్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.
ఈ సినిమాలో ‘టబూ’ పవర్ ఫుల్ ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమీషనర్ గౌరీ హెగ్డేగా నటిస్తున్నారు. వీరు ముగ్గురు కాకుండా ఇంకా సంయుక్త, దునియా విజయ కుమార్, విటివి గణేశ్, బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: పూరీ జగన్నాథ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యాం కే నాయుడు, ఆర్ట్: ఆశిష్ తేజ, జానీ షేక్, ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా చేశారు.
జేబి మోషన్ పిక్చర్స్, పూరీ కనెక్ట్స్’ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణ రావు కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.