రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో ఆది సాయికుమార్, మేఘలేఖ జంటగా నటిస్తున్న ‘ఎస్‌ఐ యుగంధర్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో టైటిల్‌లోనే హీరో ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ (ఎస్ఐ)గా స్పష్టం చేశారు కనుక టీజర్‌లో తనను తాను దేవుడిగా భావించే ఓ సైకో మర్డర్ మిస్టరీని చేదించే పోలీస్ ఆఫీసర్‌గా చూపించారు.
ఈ సినిమాలో రాకేందుమౌళి వెన్నెలకంటి, లావణ్య, పవన్ తేజ్ కొణిదెల, శివకృష్ణ, కాదంబరి కిరణ్, గాయత్రి భార్గవి, జయలలిత తదితరులు నటించారు.
ఎస్‌ఐ యుగంధర్‌కు కథ, స్క్రీన్‌ప్లే: యశ్, దర్శకత్వం: రాఘవేంద్ర కటారి, సంగీతం: మార్కస్ ఎం, సినిమాటోగ్రఫీ: రవీంద్రనాథ్ టి, ఎడిటర్: ఎస్‌జే శివకిరణ్, ఎస్‌ఎఫ్‌ఎక్స్: ఎతిరాజ్ చేస్తున్నారు.
శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. సాయి కృష్ణారెడ్డి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.