చకోర ట్రైలర్‌.. మరో భగ్న ప్రేమికుడి పోరాటం

September 27, 2026


img

శ్రవణ్, మలైకా టి. వసుపాల్ జంటగా నటిస్తున్న ‘చకోర’ సినిమా ట్రైలర్ విడుదలైంది. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఓ భగ్న ప్రేమికుడి పోరాటంగా చూపారు. 

ఈ సినిమాలో ఎల్.బి. శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, అనుష్క లుహార్, యామిని, నెల్లూరు సుధర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, అక్కెల్ల గోపాలకృష్ణ, వంగపండు, వంశీ, సుమంత్, భాను, సూర్య మకిరెడ్డి తదితరులు నటించారు.

చకోరాకు కథ, దర్శకత్వం: మంగా శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ: రూపా జి.కృష్ణ, యాక్షన్: రామ్ కిషన్, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్ చేస్తున్నారు. 

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డాక్టర్ హేమారావు చింతాడ నిర్మిస్తున్న ‘చకోర’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష