ఏమో ఏమో ఇది… సాంగ్‌, మ్యూజిక్, కెమిస్ట్రీ వెరీ గుడ్!

September 29, 2026


img

రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏమో ఏమో ఇది’ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. కనుక మెల్లగా ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. పాట చూస్తే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మద్య కెమిస్ట్రీ బాగానే సెట్ అయినట్లు అనిపిస్తోంది. 

కృష్ణకాంత్ సాహిత్యం, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, కార్తీక్, రమ్య బెహరాల ఆలాపన అన్నీ అద్భుతంగా ఉన్నాయి.  ఈ సినిమాకు కథ,  దర్శకత్వం: డాక్టర్ శైలేష్ కొలను, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, కొరియోగ్రఫీ: ఆట సందీప్, జ్యోతి రాజ్, వీఎఫ్‌ఎక్స్‌: డెక్కన్ డ్రీమ్స్ చేస్తున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్న రూపొందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష