మేడారంలో హీరో నాని.. టీమ్‌ మొక్కులు చెల్లింపులు

September 29, 2026
img

‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం నేడు మేడారంకు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించారు. వారిలో నాచురల్ స్టార్ నాని, సంపూర్ణేష్ బాబు, ఇతర నటీనటులు ఉన్నారు. వారు అక్కడ తులాభారంలో తమ బరువున్న బంగారం (బెల్లం) వనదేవతలకు సమర్పించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజల తర్వాత అమ్మవారి ప్రసాదం అందజేశారు. 

నాని అక్కడకు వచ్చిన సంగతి తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వారితో నాని, మిగిలినవారు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత నాని బృందం దేవాలయ పరిసర ప్రాంతంలో తిరుగుతూ అక్కడి విశేషాలను, కొత్త నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. 

Related Post