దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి కోల్పోవడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగబోతోంది. దీని కోసం రాష్ట్ర ఎన్నికల కేంద్రం సంఘంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో లేదా మూడో వారంలో షెడ్యూల్ ప్రకటించి డిసెంబర్‌లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ, నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రకటనతో ముగిసే అవకాశం ఉంది. కనుక ఆ తర్వాత ఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
షెడ్యూల్ విడుదలైన తర్వాత సుమారు 40 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. కనుక ఈ లెక్కన డిసెంబరు రెండో లేదా మూడో వారంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశముంది.
ఒకవేళ డిసెంబరులో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే.. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించవచ్చు.