చిరునామా మారితే ఓటు రద్దు చేస్తారా? ప్రకాష్ రాజ్

August 15, 2026


img

నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా తన ఓటును ‘ఆబ్జెక్షన్ లిస్ట్‌’లో చేర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

తాను చిరునామా మార్పు కోసం ఫామ్-8 సమర్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు దాన్ని స్వీకరించలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. కొత్త ఓటు నమోదు కోసం ఫామ్-6 సమర్పించాలని అధికారులు తనకు సూచించినట్లు చెప్పారు. అయితే చిరునామా మారినంత మాత్రాన కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

“అడ్రస్ మారినప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలా? ఫామ్-8కు బదులుగా ఫామ్-6 ఎందుకు?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా ఓటుని రద్దు చేయాలనుకుంటే చేయండి. కానీ నా ఒక్క ఓటు రద్దు చేస్తే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నేను పది ఓట్లు ప్రభావితం చేయగలనని గుర్తుంచుకోండి,” అని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.    


Related Post